PM Kisan: పీఎం కిసాన్ ఎనిమిదవ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా ? క్లారిటీ ఇచ్చిన కేంద్రం..


PM Kisan Samman Nidhi: దేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికి తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద పథకం ప్రధాని కిసాన్ సన్మాన్ నిధి. అయితే ఈ పథకంలో భాగంగా ప్రతి రైతు అకౌంట్లోకి రూ.2000

PM Kisan: పీఎం కిసాన్ ఎనిమిదవ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా ? క్లారిటీ ఇచ్చిన కేంద్రం..

Pm Kisan

PM Kisan Samman Nidhi: దేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికి తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద పథకం ప్రధాని కిసాన్ సన్మాన్ నిధి. అయితే ఈ పథకంలో భాగంగా ప్రతి రైతు అకౌంట్లోకి రూ.2000 విడతల వారిగా వేయనున్నారు. ఇలా మొత్తం రూ.6000 వరకు ప్రతి ఒక్క రైతు ఖాతాలో పడిపోనున్నాయి. ఇందుకోసం కేంద్రం దాదాపు రూ.11.66 కోట్లను రైతుల ఖాతాలో జామ చేయనుంది. ఏప్రిల్ 1 నుంచి ఎనిమిదవ విడత డబ్బులు రైతుల ఖాతాలో వస్తాయని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఇందుకు సంబంధించిన డబ్బులు ఎవరికి అకౌంట్లోకి చేరలేదు. ఇందుకు కారణం.. ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పీఎం కిసాన్ ఎనిమిదవ విడతకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఈ విషయంపై కేంద్రం స్పందించింది.

ఏప్రిల్ చివరినాటికి రూ.20,000 నుంచి రూ.25,000 మధ్య రూ.2000 ఎనిమిదవ విడత డబ్బులు ప్రతి ఒక్కరి అకౌంట్లో వేయనున్నట్లు కేంద్ర వ్యవససాయ శాఖ సహయ మంత్రి కైలాష్ చౌదరి తెలిపారు. ఇది రైతుల పథకం. కేవలం వారికి తోడ్పాటు కోసమే పీఎం కిసాన్ పథకం. దీనికి ఎన్నికలకు ఎలాంటి సంబంధం ఉండదు. ఏప్రిల్ 1 నుంచి ఎనిమిదవ విడత డబ్బులు వస్తాయని వార్తలు వస్తున్నాయి. కానీ అది నిజం కాదు. డబ్బులు ఇంకా రైతుల ఖాతాలోకి జమచేయలేదు.. అంటూ చెప్పుకోచ్చారు కైలాష్ చౌదరి.

సుమారు 10 కోట్ల మంది రైతులకు ఒకేసారి రూ.20,000 కోట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మంత్రిత్వ శాఖ తరపున కావాల్సిన అన్ని పనులు దాదాపు పూర్తయ్యాయని.. కేవలం ప్రధాన మంత్రి కార్యక్రమం మాత్రమే చేయాల్సి ఉంది. పీఎం కిసాన్ వార్షిక బడ్జెట్ రూ. 65,000కోట్లు. ఈ డబ్బులు మూడు విడతలుగా ప్రకటించింది కేంద్రం. 2020 డిసెంబర్ నుంచి 2021 మార్చి వరకు 9,92,12,971 మంది రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేశారు. 2020 డిసెంబర్ 25న ప్రధాని మోదీ ఒకేసారి 9 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ డబ్బులను ప్రకటించారు.

మీ ఖాతాలో డబ్బులు వచ్చాయా ? లేదా ? చెక్ చేసుకోండిలా..

* ముందుగా ప్రధాన మంత్రి కిసాన్ యోజన వెబ్ సైట్ (https://pmkisan.gov.in/) లాగిన్ అవ్వండి.
* అందులో మీకు Formers Corner (ఫార్మార్స్ కర్నర్) ఆఫ్షన్‏ను సెలక్ట్ చేసుకోవాలి.
* ఆ తర్వాత మీకు లభ్దిదారుల జాబిత Beneficiaries List ఆప్షన్ కనిపిస్తుంది.
* ఆ జాబితాలో మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం పేర్లను సెలక్ట్ చేసుకోవాలి.
* ఆ తర్వాత మీ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా లేదా మొబైల్ నంబర్‏ను ఎంచుకోవాలి.
* అనంతరం మీకు విడతల స్టేటస్ కనిపిస్తుంది.

పీఎం కిసాన్ పథకం నిబంధనలు..

– కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు దీనికి దూరంగా ఉంటారు.
– నిపుణులు, వైద్యులు, ఇంజనీర్లు, సిఐలు, న్యాయవాదులు, వాస్తుశిల్పులు ఈ పథకానికి అర్హులు కాదు.
– మేయర్ లేదా జిల్లా పంచాయతీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్‌సభ, రాజ్యసభ ఎంపి.
– మాజీ లేదా ప్రస్తుత రాజ్యాంగ పదవి కలిగిన రైతులు ప్రస్తుత లేదా మాజీ మంత్రులు అర్హులు కాదు.
– గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన రైతులకు ఎటువంటి ప్రయోజనం ఉండదు.
– పదివేల రూపాయలకు పైగా పెన్షన్ పొందిన రైతులకు ప్రయోజనం లభించదు.
– రూ .6000 పథకం ప్రయోజనం పొందడానికి సాగు భూమి ఉండాలి.

Also Read: PM Kisan: రైతులు బీ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2000 వచ్చాయా ? ఇలా చెక్ చేసుకోండి..